తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని టీటీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. భార్యలతో మాట్లాడటానికి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా చర్యలకు దిగాలని కోరారు. ఒక్కో నియోజకవర్గానికి టీఆర్ఎస్ రూ.10 కోట్లు పంపిందని విమర్శించారు. తనకిష్టం లేని ప్రభుత్వాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.