ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ విద్యార్ధులు సత్తా చాటారు. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లోని టాప్ టెన్‌లో చోటు సంపాదించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్ టెన్‌లో 6, అగ్రికల్చర్‌లో 3 ర్యాంకులు సాధించారు.

ఇంజనీరింగ్‌లో తెలంగాణకు చెందిన పి.వేద ప్రవీణ్ రెండో ర్యాంక్.. హేద హవ్య నాలుగో ర్యాంక్, బి. కార్తికేయ 5, అభిజిత్ రెడ్డి 8, ఎల్ ఆర్యన్ 9, హేమ వెంకట్ అభినవ్ 10 సాధించారు. మెడికల్ అండ్ అగ్రికల్చర్‌లో టి.హాసిత 4, జి.మాధురి రెడ్డి 5, ఎ.కుశ్వంత్ 10 ర్యాంకులు సాధించారు. ఇక తెలంగాణ నుంచి ఎంసెట్‌కు 36,698 మంది హాజరయ్యారు.