TSPSC Group 4 Results 2024: తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC Group 4 Results) ఫిబ్రవరి 9న విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను టీఎస్పీస్సీ వెల్లడించింది.

TSPSC Group 4 Results 2024: లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త. తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC Group 4 Results) ఫిబ్రవరి 9న విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను టీఎస్పీస్సీ వెల్లడించింది. మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని కమిషన్ సూచించింది.

ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో ర్యాంకులు చెక్‌ చేసుకోవాలని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచించింది. త్వరలో ఎంపికైన వారి వివరాలను సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌ చేయనున్నట్టు తెలిపింది. గతేడాది తెలంగాణలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.