కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఈసారి డీఎస్పీల ట్రాన్స్ ఫర్.. ఎంత మందంటే?  

DSP Transfers: సార్వత్రిక ఎన్నికల వేళ  తెలంగాణలో మరోసారి పోలీసు శాఖలో బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో పనిచేస్తున్న 47 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana State Government Transferd 47 Dsps In Police Department KRJ

DSP Transfers: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పోలీసు శాఖలో బదిలీల పర్వం జరిగింది.  ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన రేవంత్ సర్కార్ తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ సారి మొత్తం 47 మంది డిఎస్పీలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వేళ ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేశారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. గత నెలలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios