హైదరాబాద్: ఈనెల 10 నుంచి తెలంగాణ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల పదవులను భర్తీ చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ శాసన మండలిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను ఖారారు చేశారు సీఎం కేసీఆర్.  

తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ తోపాటు నలుగురిని ప్రభుత్వ విప్ లుగా నియమిస్తూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లును ఖరారు చేశారు. 

అలాగే విప్ లుగా ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, దామోదర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్ లను నియమించారు. అధికారికంగా ఉత్తర్వులు అందుకోవడమే తరువాయి. అయితే సీఎంవో కార్యాలయం నుంచి సంబంధింత చీఫ్ విప్, ప్రభుత్వ విప్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.