తెలంగాణలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల:78.42 శాతం ఉత్తీర్ణత

తెలంగాణలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం నాడు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు మాసంలో  సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. 78.42 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ తెలిపింది.

Telangana SSC Supplementary results 2022 declared

హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం నాడు విడుదలయ్యాయి. టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ ఏడాది ఆగష్టు మాసంలో జరిగాయి. ఆగస్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు గాను 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  తెలంగాణ సప్లిమెంటరీ పరీక్ష పలితాలను  తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 79.82 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 82.21 శాతం మంది బాలికలు, 78.42 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించినట్టుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. 48,167 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో 38,447 మంది పాసయ్యారని విద్యాశాఖ ప్రకటించింది.  పరీక్షా ఫలితాలపై రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. 

టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల కోసం https://manabadi.co.in, https:// bse.telangana.gov.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ నెల 10వ తేదీన టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని భావించారు. కానీ నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే తెలంగాణ విద్యాశాఖ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.

ఈ ఏడాది మే 23వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించారు.11 ప్రశ్నాపత్రాలకు బదులుగా ఆరు ప్రశ్నాపత్రాలకే పరీక్షలను కుదించింది తెలంగాణ విద్యాశాఖ. టెన్త్ పరీక్షలకు 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు రాసేందుకు గాను 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios