తనకు రక్షణ కల్పించాలని ప్రజాగాయకుడు, ప్రజా నౌక గద్దర్ కోరుతున్నారు. అలాగే.. అన్యాక్రాంతం అయిన బాలసాయి బాబా ట్రస్ట్ భూములను కాపాడాలని కలెక్టర్ శివ లింగయ్యకు వినతిపత్రం అందజేశారు.
తనకు రక్షణ కల్పించాలని ప్రజాగాయకుడు, ప్రజా నౌక గద్దర్ కోరుతున్నారు. అన్యాక్రాంతమవుతున్న బాలసాయి బాబా ట్రస్ట్ భూములను కాపాడాలని కలెక్టర్ శివ లింగయ్యకు వినతిపత్రం అందజేశారు. భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్నందున తనపై శత్రువులు దాడికి యత్నిస్తున్నారని అన్నారు. అందుకే తనకు పోలీసు రక్షణ కావాలని వెస్ట్ జోన్ డిసిపి సీతారాంకు తన గోడును వెళ్లబోసుకుంటూ వినతిపత్రం అందజేశారు.
రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలోని బాలసాయి బాబా ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు చెందాల్సిన భూములు కొందరు వ్యక్తులు లాక్కున్నారని, వెంటనే అర్హులైన పేదలకు ఆ భూములను పంచాలని గాయకుడు గద్దర్ కోరుతున్నారు. బాలసాయి బాబా ట్రస్ట్ భూములపై తన పోరాటం ఆగదనీ, పేదలకు చెందాల్సిన 59 ఎకరాల భూములు పంచి పెట్టే వరకు తన పోరాటం ఆగదని గద్దర్ పేర్కోన్నారు.
