Asianet News TeluguAsianet News Telugu

చ‌లికి వ‌ణుకుతున్న తెలంగాణం.. 5.9 డిగ్రీల అత్య‌ల్పంగా ఉష్ణోగ్రత న‌మోదు

Hyderabad: శీతాకాలం ప్రారంభం కాగానే తెలంగాణ‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియ‌స్ నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా రాత్రి-తెల్లవారుజామున ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండ దుప్ప‌ట్లు క‌ప్పుకుని ఉండిపోతున్నారు.

Telangana shivering with cold.. The lowest temperature was recorded as 5.9 degrees Celsius
Author
First Published Dec 10, 2022, 1:56 AM IST

Telangana winter starts:  దేశంలో శీతాకాలం షురూ అయింది. ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా ప‌డిపోవ‌డంతో పాటు చ‌లి తీవ్ర‌త పెరుగుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌లు చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. రాత్రి, తెల్ల‌వారుజామున చ‌లిగాలుత తీవ్ర‌త పెరింది. ఆయా స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉంటున్నారు. శీతాకాలం ప్రారంభం కాగానే తెలంగాణ‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియ‌స్ నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు చ‌లికి వ‌ణికిపోతున్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) శుక్రవారం నివేదిక ప్రకారం, కామారెడ్డిలోని డోంగ్లిలో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చ‌లి తీవ్ర‌త పెరుగుతోంది. ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. ఆదిలాబాద్‌లోని పొచ్చెర, బేలలో వరుసగా 7 డిగ్రీల సెల్సియస్‌, 7.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా, సంగారెడ్డిలోని న్యాల్‌కల్‌లో 6.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, మెదక్, నిర్మల్, రాజన్న-సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, వికారాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి.

కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఇండ్ల‌లోప‌లే ఉండవలసి వచ్చింది. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బేల, బజార్‌హత్‌నూర్‌ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌, 7.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తలమడుగు, జైనైత్, ఆదిలాబాద్ రూరల్, నేరడిగొండ, తాంసి, ఉట్నూర్, ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, గాదిగూడ మండలాల్లో 7.8 డిగ్రీల సెల్సియస్ నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యల్పంగా నిర్మల్ జిల్లా భైంసాలో 7.7 డిగ్రీల సెల్సియస్, కుంటాల మండంలో 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెంబి, లక్ష్మణచాంద, ఖానాపూర్, నర్సాపూర్ (జి), మామడ, కుబేరు, కడం పెద్దూరు మండలాల్లో 8.4 నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. TSDPS నివేదిక‌ల ప్ర‌కారం.. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుండి 16 డిగ్రీల సెల్సియస్ వరకు, తెలంగాణలోని దక్షిణ-మధ్య జిల్లాల్లో 16 డిగ్రీల సెల్సియస్ నుండి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios