హైదరాబాద్: తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చకుండా స్టే ఇవ్వాలని శుక్రవారం నాడు పిటిషనర్లు కోరారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

Also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత: కేసీఆర్‌కు హైకోర్టు షాక్

తెలంగాణ సచివాలయాన్ని కూల్చి వేయకుండా స్టే విధించాలని కోరుతూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేసింది. ఈ  పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలను హైకోర్టు వింది.

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేస్తే ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని పిటిషనర్ల తరపున న్యాయవాది హైకోర్టును కోరారు.  సచివాలయాన్ని కూల్చివేస్తే  డబ్బులు వృధా అవుతాయని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.

భవనాల నిర్వహణ సరిగా లేదు, భవనాలు శిథిలావస్థకు చేరుకొన్నాయని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  అయితే  చిన్న చిన్న మరమత్తులు నిర్వహిస్తే తెలంగాణ సచివాలయాన్ని ఉపయోగించుకోవచ్చని  పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు.ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు  తీర్పును రిజర్వ్‌లో  పెట్టింది.