తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. విద్యాసంస్థల యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్కూల్స్, కాలేజ్‌లు తెరవడానికి ముందు పూర్తిగా శానిటైజేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. విద్యాసంస్థల్లో అర్హులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇక, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందన్న వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు (Sankranti holidays) కూడా కలిసివచ్చాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడగించనుందనే కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 30 వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. అయితే కొద్ది రోజులుగా 8వ తరగతి నుంచి ఆపై తరగతులకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను తెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీ ఓపెన్‌కు తెలంగాణ వైద్య, విద్య శాఖల అధికారులు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
