హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల సంఖ్య తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగింది.2017 నుంచి 2018 వరకు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాల గణాంకాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 846 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 2018 సంవత్సరానికి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 900 కి చేరుకుంది. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తెలుపుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  2018 రికార్డును గురువారం నాడు విడుదల చేసింది.

 దేశవ్యాప్తంగా 2017 సంవత్సరంలో 5760 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  2018 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 5955 చేరింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టు ప్రకారం 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 851 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

 2018 లో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 908 చేరింది. ఈ రెండు ఏళ్లలో మహిళా రైతుల కంటే పురుషులే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2017లో  729 మంది పురుష రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు.117 మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2018 సంవత్సరంలో 793 మంది పురుషులు, 107 మంది మహిళా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఆత్మహత్యకు పాల్పడిన రైతుల్లో తొలి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం  నిలిచింది. మూడో స్థానంలో తెలంగాణ ఉంది.  2017లో మహారాష్ట్ర లో 2239 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. 2018 సంవత్సరంలో రెండు వేల నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 2017లో కర్ణాటకలో 1365 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. 2018లో 1157 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు స్కీమ్ తెచ్చిన కూడా వ్యవసాయదారుల సమస్యలు తీరలేదు.

 ఈ కారణంగానే 2017నుండి 2018లలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలను పాలకులు పరిష్కరించడం లేదనే అభిప్రాయాలను సామాజికవేత్తలను వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తం పరిష్కరించడం లేదు రైతుబంధు వంటి ఒకటి రెండు పథకాల వల్ల వ్యవసాయ రంగం బాగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది కానీ ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.