కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... 15మందికి తీవ్ర గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
వేములవాడ రాజరాజేశ్వస్వామి దర్శనానికి వెెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్: దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఆటో రోడ్డు ప్రమాదానికి గురయి 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు ఇప్పటివరకు అందిన సమచారాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకుచెందిన కొందరు ఓ ఆటోలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఉదయమే ఆలయానికి చేరుకుని దర్శనాది కార్యాక్రమాలన్ని ముగించుకుని సాయంత్రం స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రమాదానికి గురయ్యారు.
వీరు ప్రయాణిస్తున్న ఆటోను karimnagar district మనకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ ఢీ కొట్టింది. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటో తుక్కుతుక్కయ్యింది. అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదసమయంలో ఆటోలో వున్న 15 మంది తీవ్రంగా గాయపడగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది.
read more ఔటర్ పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. మంటల్లో దగ్థం...
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్నవారిని కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న వారు క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ రోడ్డు ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళుతుండటంతో ప్రమాద తీవ్రత ఎక్కవగా వున్నట్లుగా తెలిపారు.
read more రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను కాపాడి... మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి (VIDEO)
ఇదిలావుంటే ఇటీవల ఇలాగే పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని భారీ ప్రాణనష్టం సంబవించింది. అంత్యక్రియల కోసం రాత్రి సమయంలో స్మశానానికి వెళుతుండగా వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దీంతో 17మంది దుర్మరణం పాలయ్యారు.
west bengal ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాగ్దాకు చెందిన కొంతమంది ఓ వాహనంలో మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలకు బయలుదేరారు. అయితే రోడ్డుపై వేగంగా వెళుతున్న సమయంలో సదరు వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. రోడ్డు పక్కన నిలిపివున్న ట్రక్కును అంత్యక్రియలకు వెళుతున్న వాహనం అతివేగంతో ఢీకొట్టింది. దీంతో 17మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.