గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్సు వేళల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఉదయం ఐదుగంటల నుంచే బస్సులు డిపోల నుంచి బయలుదేరేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఉదయం ఆరుతర్వాత మాత్రమే బస్సులు డిపో నుంచి బయటకు అడుగుపెట్టనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ అధికారుల చర్యలు చేపడుతున్నారు.

తెల్లవారుజామున డిపోల నుంచి బస్సులు బయలుదేరడడం వల్ల ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంటుందని అధికారులు నిర్థారణకు వచ్చారు.  ఏఏ సమయాల్లో బస్సుల్లో ఆక్యుపెన్సీ ఎక్కువగా, ఏఏ సమయాల్లో తక్కువగా ఉంటుందనే వివరాలను రాబట్టారు. 

AlsoRead టీఎస్ ఆర్టీసీపై గడ్కరీ సంచలన వ్యాఖ్యలు: అందుకే కేసీఆర్ వెనక్కి......

అందులో ప్రధానంగా ఉదయం 5గంటల నుంచి ఉదయం 6గంటల మధ్యలో వివిధ మార్గాల్లో ప్రయాణించే బస్సుల్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుందని భావించారు. అందులో భాగంగా ప్రస్తుతం నగరంలో ఉదయం 5గంటలకే ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయలు దేరకుండా గంట సమయాన్ని కుదించాలని భావిస్తున్నారు. 

అదేవిధంగా మధ్యాహ్న సమయంలోనూ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా నమోదవుతుందని నిర్ధారించారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు బస్సులను నిలిపేయాలని భావిస్తున్నారు. 2గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు ఆర్టీసీ బస్సులన్నీ రోడ్లపై ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. 9.30గంటల తర్వాత మెజార్టీ బస్సులు డిపోలకు చేరేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎప్పటి నుంచి బస్సుల వేళలను మార్పు చేయాలనే అంశంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.