హైదరాబాద్: దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచరిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు.

ఆదివారం నాడు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని తమిళి సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. 

హైద్రాబాద్‌ వరల్డ్ క్లాస్ సిటీ అంటూ తమిళిసై గుర్తు చేశారు. గత ఆరేళ్లుగా అభివృద్ధి కోసం గట్టి పునాదులు పడిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.  అన్ని రంగాల్లో అభివృద్ధిలో  ముందుకు సాగుతున్నా.. అక్షరాస్యతలో వెనుకబడిన విషయాన్ని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. 

అక్షరాస్యతలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను  ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని విద్యావంతుల్ని చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా గవర్నర్ గుర్తు చేశారు.  

రాష్ట్రంలో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టుగా గవర్నర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం దేశానికే ఆదర్శమని గవర్నర్ చెప్పారు.