జీహెచ్ఎంసీలో కరోనా జోరు: తెలంగాణలో మొత్తం కేసులు 46,274కి చేరిక
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46,274కి చేరుకొన్నాయి.
హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46,274కి చేరుకొన్నాయి.
రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 34,323 మంది కోలుకొన్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 422 మంది మృతి చెందినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ తెలిపింది.
రాష్ట్రంలో 11,530 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం వివరించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,76,222 మంది శాంపిల్స్ సేకరించారు. గత 24 గంటల్లో 11,003 మంది నుండి శాంపిల్స్ తీసుకొన్నారు.
also read:సహనాన్ని పరీక్షించొద్దు, ఇదే చివరి అవకాశం: వైద్య శాఖపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ పరిధిలో 510, రంగారెడ్డిలో 106, మేడ్చల్ లో 76, సంగారెడ్డిలో 10, ఖమ్మంలో 3, వరంగల్ అర్బన్ లో 73, వరంగల్ రూరల్, నిర్మల్,యాదాద్రి భువనగిరిలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
కరీంనగర్ లో 87, జగిత్యాల, మహబూబాబాద్ లో36 చొప్పున కేసులు రికార్డయ్యాయి. పెద్దపల్లిలో 8, మెదక్ లో13, మహబూబ్ నగర్ లో 50, మంచిర్యాలలో 3, భద్రాద్రి కొత్తగూడెంలో 11, జయశంకర్ భూపాలపల్లిలో 26,నల్గొండలో 24, ఆదిలాబాద్ లో 11, ఆసిఫాబాద్ లో 4, వికారాబాద్ లో 11 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది.
నాగర్ కర్నూల్ లో 27, జనగామలో 12, నిజామాబాద్ లో 31, ములుగులో 9, సూర్యాపేటలో 12, సిద్దిపేటలో 3, జోగులాంబ గద్వాలలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.