తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: ఒక్క రోజులోనే 219 కేసులు


తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం నాడు ఒక్క రోజే 219 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

Telangana Records 219 Corona Cases After February

హైదరాబాద్: Tel;angana  రాష్ట్రంలో Corona కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  వైద్యశాఖాధికారులు సూచిస్తున్నారు.ఈ నెల 14న రాష్ట్రంలో కొత్తగా 219 కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత  రాష్ట్రంలో 200 కి పైగా  Covid-19 కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.రాష్ట్రంలో ప్రస్తుతం 1259 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని  అధికారులు తెలిపారు. ప్రతి రోజూ కరోనా కేసుల సంఖ్యను పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ 15 వేల నుండి 22 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.జలుబు, దగ్గు, జ్వరం ఉన్న బాధితులు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాధికారుల సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.1 శాతానికి పైగా ఉందని అధికారులు తెలిపారు.ఈ నెల 13వ తేదీ నాటికి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,94, 584కి చేరింది. ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో చనిపోయారు. 7,89,357 మంది కరోనా నుండి కోలుకున్నారు. 

 తెలంగాణలో కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios