న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో హైవేల నిర్వహణకు రూ.2వేల కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు తెలంగాణ ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి. డా.బి.ఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో వన్ నేషన్-వన్ ట్యాగ్ పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సహాయమంత్రి వీకే సింగ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

టోల్ ప్లాజాలలో ఎక్కువ సమయం వెచ్చించకుండా ఇంధనం కూడా ఆదా అయ్యేలా వన్ నేషన్ వన్ ట్యాగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న హైవేలపై ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాలుగా మార్చాలని కోరారని అందుకు అంగీకరించినట్లు తెలిపారు. 

అయితే ఈ విధానాన్ని హైబ్రిడ్ గా ఏర్పాటు చేసి రెండు రకాలుగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. టోల్ ప్లాజాలలో ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానంతో పారదర్శకత వస్తుందని తెలిపారు.  తెలంగాణ నేషనల్ హైవే లపై ఉన్న ఇబ్బందులు, పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కృషి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో జాతీయ రహదారుల ఎక్కువగా మంజూరు అయినట్లు చెప్పుకొచ్చారు. 3,150 కిలో మీటర్లు అదనంగా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు. 

1,380 కిలోమీటర్లకు నంబరింగ్ ఇవ్వడం జరిగిందని మిగిలిన వారికి ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. డిపిఆర్ సిద్ధమైన రోడ్లకు నంబరింగ్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నంబరింగ్ అయిన వాటిలో పనులు స్టార్ట్ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. 

రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని అందుకు 50శాతం భూసేకరణలో రాష్ట్రం భరిస్తుందని తెలిపారని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు.

హైవే నెట్ వర్క్ కు రీజనల్ రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది హైవేల నిర్వహణకు రూ.270 కోట్లే బడ్జెట్ లో పెట్టారని దాన్ని రూ. 2వేల కోట్లకు పెంచాలని కోరినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.