తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటు వేసేందుకు ప్రజలు బారీగా బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ను ఈ విధంగా ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటు వేసేందుకు ప్రజలు బారీగా బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ను ఈ విధంగా ఉంది.
హైదరాబాద్: 7 శాతం
రంగారెడ్డి : 8 శాతం
కరీంనగర్: 10 శాతం
మహబూబ్‌నగర్: 11.5 శాతం
నల్గొండ: 6 శాతం
అదిలాబాద్: 5 శాతం
ఖమ్మం: 7 శాతం
వరంగల్: 7 శాతం
మెదక్: 7 శాతం
నిజామాబాద్: 6 శాతం
తెలంగాణ అసెంబ్లీలోని 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇందుకోసం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు. దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 7, 2018, 10:00 AM IST