తెలంగాణ ఎన్నికలు.. ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ ఆదివారం ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులను వెలువరించింది. కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్యానెల్ కన్వీనర్‌గా చల్లా వంశీ చంద్ రెడ్డిని నియమించారు. కో-కన్వీనర్‌గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. కమిటీలో ముగ్గురు సభ్యులుగా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, నూతి శ్రీకాంత్, ఎన్ ప్రీతం ున్నారు.
‘‘తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు-2023 కోసం స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడానికి సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను ఏఐసీసీ ఆమోదించింది, తక్షణమే అమలులోకి వస్తుంది’’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇక, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 85 సీట్లలో విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం లేదని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో తమకు 40 నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు 9న ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందని.. అదే రోజు ప్రగతి భవన్ పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగత కక్ష తీర్చుకునే ధోరణి లేదని అన్నారు.