Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల సిత్రం.. ఓటర్‌కు స్నానం చేయించిన బీఆర్ఎస్ శ్రేణులు..!!

ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులకు ఓటర్లంతా దేవుళ్లులా కనిపిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల కోసం రకరకాల స్టంట్‌లు చేస్తుంటారు.

Telangana Polls 2023 BRS workers bathe elderly man in a poll stunt video goes viral ksm
Author
First Published Nov 16, 2023, 4:30 PM IST

ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులకు ఓటర్లంతా దేవుళ్లులా కనిపిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల కోసం రకరకాల స్టంట్‌లు చేస్తుంటారు. తాజాగా ఎన్నికల వేళ బీఆర్ఎస్  ఓ వృద్దుడికి స్నానం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆలేరులో చోటుచేసుకుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతునున్న వీడియో ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ కండువాలు ధరించిన కొందరు యువకులు ఆరుబయట స్నానం చేస్తున్న ఓ వృద్దుని వద్దకు వెళ్లారు.

వారిలో ఒకరు అతని తల మీద నుంచి నీళ్లు పోస్తుండగా.. మరొకరు అతని ఒంటిపై  చేయి వేసే సబ్బు రుద్దే ప్రయత్నం చేశాడు. అయితే అలా చేయవద్దని ఆ వృద్దుడు వారిని కోరుతునప్పటికీ వారు వినిపించుకోలేదు. మరో వృద్దుడు కూడా వారికి జత కలిశారు. అంతేకాకుండా వారు కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చారు. అయితే వీరంతా.. ఆలేరు  అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుదారులని చెబుతున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిశ్రమ స్పందన వస్తుంది. అయితే చాలా మంది దీనిని పోల్ స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు. ఈ విధంగా  ఓట్లు అభ్యర్థించడం సరికాదని పేర్కొంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios