Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదు.. ఇక్కడ ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా?: కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణలో బీజేపీ మ్యానిఫెస్టోకు మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని చెప్పారు.

Telangana polls 2023 BJP will form government says Kishan Reddy ksm
Author
First Published Nov 20, 2023, 1:57 PM IST

తెలంగాణలో బీజేపీ మ్యానిఫెస్టోకు మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని చెప్పారు. బీజేపీకి బీసీలు, ఎస్సీల నుంచి మద్దతు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈసారి బీఆర్‌ఎస్ గెలిచినా, కాంగ్రెస్ పార్టీ గెలిచినా తెలంగాణ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనిఅన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ప్రజల నెత్తిన భస్మాసుర హస్తమే అని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసిందా? అనిప్రశ్నించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలకే దిక్కు లేదని.. తెలంగాణలో వారి ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా? అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల చేతిలోకి చిప్ప వస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతికి మూల్యం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే.. కేసీఆర్ కుటుంబ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫేక్ గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్థిక మూలాలను బీజేపీ దెబ్బతీసిందని ఆరోపించారు. తెలంగాణ అభిృద్ది డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యమని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వస్తుందని చెప్పారు.

బీజేపీ అధికారంలోకి రాగానే.. వరి పంటకు రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఉజ్వల పథకం లబ్దిదారులకు నాలుగు ఉచిత సిలిండర్లు ఇస్తామని.. బడుగు బలహీన వర్గాలకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్ల కంటే ఎక్కువ అవసరం ఉండదని తెలిపారు. నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లను ఎత్తేసి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios