Asianet News TeluguAsianet News Telugu

బాధ్యతలేని బద్దకస్తులు.. హైదరాబాదీ ఓటర్లు..

Telangana Elections: ఈసారి కూడా హైదరాబాద్ వాసులు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. ఎప్పటి లాగానే హైదరాబాద్ లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. వారికీ బాధ్యత లేదా? బద్దకస్తులా?  

Telangana Polling percentage People of Hyderabad did not come forward to vote there this time krj
Author
First Published May 14, 2024, 3:00 PM IST

Telangana Elections: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి నాలుగో విడత పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. వేసవి కావడంతో అన్ని జిల్లాల్లోని ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రాష్ట్రరాజధాని హైదరాబాద్ లోని ఓటర్లు మాత్రం ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. హైదరాబాద్ మహానగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం కాస్త హడావుడి ఉన్నప్పటికీ ఓటింగ్ ముగిసేలోపు అతి తక్కువ పోలింగ్ శాతం నమెదయ్యింది. కొత్తగా ఓటు వచ్చిన ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుముఖత చూపలేదు. గతంలో కూడా లోక్ సభ ఎలక్షన్ లో ఇదే సీన్ రిపీట్ అయ్యింది.  

 ఓ వైపున ఎండలు మండిపోవడం, మరోవైపున సెలవు రోజు కావడంతో ఓటర్లు ఇండ్లకే పరిమితమయ్యారు. అలాగే మూడురోజులు వరుసగా హాలీడేస్ కావడంతో కొంతమంది టూర్లు వేసుకోగా, మరికొంతమంది తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలు ఖాళీగా కనిపించసాగాయి. హాలీడే వస్తే చాలు టూర్లకు వెళులుతున్నారు కానీ తమ ఓటు హక్కును వినియోగించుకుందాం అన్ని ఆలోచనలో హైదరాబాద్ ఓటర్లకు లేదంటున్నారు అధికారులు.

గ్రేటర్ హైదరాబాద్ లోని నియోజకవర్గాల్లో ఓటింగ్ 40 శాతానికి దాటకపోవడంతో అధికారులు,  ఎన్నికల కమిషన్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. కొంతమంది ఓటర్లు అందుబాటులో లేక ఓటు వేయలేకపోతే మరి కొంత మంది ఓటర్లు ఎండలకు భయపడి బయటికి వచ్చేందుకు భయపడ్డారు. ఎన్నికల అధికారుల పోలింగ్ శాతం పెరిగేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదంటున్నారు. కొన్ని అధ్యయణాల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లను అనుమతించకపోవడం వల్లే యువకులు పోలింగ్ కు రావడం లేదని చెబుతున్నారు. 

 అత్యల్పంగా.. ఇకపోతే గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ  లోక్‌సభ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ నగరంలో అతి తక్కువ పోలింగ్ శాతం రికార్డయ్యింది. బహదూర్ పుర నియోజకవర్గంలో అత్యల్పంగా 34. 19 శాతం పోలింగ్ నమోదయ్యింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios