Asianet News TeluguAsianet News Telugu

Telangana politics: తెలంగాణలో జంపింగ్ రాజకీయాలు.. ఎవరికి వరమో.. ఎవరికి శాపమో?

Telangana politics: తెలంగాణ రాజకీయాలలో వలస నేతల తీరు హాట్ టాపిక్ గా మారింది. నేతల పార్టీల ఫిరాయింపులతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్, బిజెపిలకు క్యూలు కట్టారు. పార్టీలు మారే నేతలను పొలిటికల్ టూరిస్ట్ అని కొందరూ విమర్శిస్తుంటే..  పార్టీని వీడిన వారిని నక్కలు, కుక్కలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోలుస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలకే తెర తీశారని మరోకొందరూ సైటర్లు వేస్తున్నారు.  

Telangana politics BRS Party Leaders Joins To Congress Party krj
Author
First Published Apr 2, 2024, 10:32 PM IST

Telangana politics: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతుంది. టిఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు క్యూ కడుతున్నారు. అతిథ్య పార్టీలో సముచిత స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఢిల్లీ అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వారిని వలస పక్షులు, పొలిటికల్ టూరిస్టులంటూ విమర్శలు గుప్పిస్తున్నా.. స్వంత పార్టీ నేతలు సంచలన  ఆరోపణలు వచ్చినా..  డోంట్ కేర్ అంటూ.. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీలో జాయిన్ అవుతున్నారు.

ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు అనే తేడా లేకుండా పార్లమెంటు ఎన్నికలవేళ టిఆర్ఎస్ పార్టీని వీడి మరోపార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య, దానం నాగేందర్ కూడా గులాబీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే..సిట్టింగ్ ఎంపీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, నాగర్ కర్నూలు ఎంపీ లు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. 

అలాగే..బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కే కేశవరావు, ఆయన కూతురు విజయలక్ష్మి టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. వాస్తవానికి గులాబీ పార్టీ వీరికి సముచిత స్థానం కల్పించుకుంటూ వస్తోంది. కేశవరావు టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండగా.. ఆయన కూతురు మేయర్, కొడుకు కార్పొరేటర్. ఇలాంటి ఉన్నత హోదాలో ఉన్నా ఫ్యామిలీ కూడా పార్టీని వీడటం గమన్హరం . 

విమర్శలు 

ఇటువంటి పరిస్థితిలో పార్టీని వీడుతున్న నేతలను టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ ముఖ్య నేతలు సంచలన ఆరోపణలు,  విమర్శలు చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ వారికి చాలా అవకాశాలు కల్పించిందనీ,  టిఆర్ఎస్ పార్టీ వారికి చాలా పదవులు ఇచ్చిందని అంటున్నారు. ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు అనేక పదవులు ఇచ్చిందని విమర్శిస్తున్నారు. వారికి పార్టీ స్థానం సమచిత స్థానం,  గౌరవం, ప్రాధాన్యత ఇచ్చిందనీ, అయినప్పటికీ  పార్టీ అధికారం కోల్పోవడంతోనే పార్టీని వీడుతున్నారనీ, ఇది సరైంది కాదనీ మండిపడుతున్నారు. అసలేందుకు ఇలా వ్యవహరిస్తున్నారనీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు  ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ వీడిన నేతలు టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. 

ఈ తరుణంలో పార్టీ వీడుతున్న నేతలపై నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడినటువంటి నేతలను తరువాత పట్టించుకోబోమనీ, ఆ నేతలను  నక్కలు, కుక్కలుతో పోల్చారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారు  దగ్గరకొచ్చి  కాలు మొక్కిన.. వారిని పార్టీలోకి తీసుకోబోమని ప్రకటించారు. మరో వైపు.. ఇటీవల కడియం శ్రీహరిని కడియం ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  కడియం శ్రీహరి ఎందుకు ఈ వయసులో నీచపు రాజకీయాలకు తెర తీశారనీ, ఆయన నీచపు రాజకీయాలు చేస్తున్నారని, ఆయన అవకాశవాది అంటూ కూడా మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. 

మరోవైపు.. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కడియం ఫ్యామిలీపై ఆరోపణ చేశారు. గత మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉండి అసెంబ్లీ సాక్షిగానే కుట్ర జరిపారనీ, చివరికి ఆయనకు ముగ్గురు కూతుర్లు మాత్రమే మిగులుతారు. ఆ ముగ్గురు కూతుర్లే ఆయనకు దిక్కు  అని  ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఇక ఎర్రంబెల్లి దయకర్ రావు ఇంకా కాస్తా రెచ్చిపోయి మాట్లాడుతూ..  తానే ఆనాడు ఎన్టీఆర్ తో మాట్లాడి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని అన్నారు. 
ఇలా పార్టీని వీడుతున్న నేతలను టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ కీలక నేతలు ఆరోపణ విమర్శలు చేస్తూన్న పరిస్థితి. 

కొత్త వారికి ప్రాధ్యానత

పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న వేళ.. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను,కీలక నేతలను తన పార్టీలో  చేర్చుకున్నారనీ, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆనాటి  పొలిటికల్ టూరిస్ట్ అంతా మళ్లీ తమ సొంత కూటికి చేరుకుంటున్నారని సైటర్లు కూడా వైరల్ అవుతున్నాయి. 

పార్టీ ఫిరాయింపులు కొనసాగుతోన్న వేళ కాంగ్రెస్ పార్టీలో మరో సమస్య వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేలు గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ పునరవిర్భావం కోసం, పార్టీ బలోపేతం క్రుషి చేసిన నేతలకు, కార్యకర్తలకు కాకుండా, టిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి నుంచి వస్తున్నటువంటి నాయకులకు మాత్రమే ప్రయారిటీ ఇస్తారనే వాదన కూడా తెర మీదికి వస్తుంది.పార్టీ అధికారం కుప్పకూలిన మూడు నెలల్లో ఆ నేతలంతా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ కూటికి వస్తున్నారు. అలాంటి నేతలు పార్టీలోకి వచ్చే మందు ఆ నేతల మంచి, చెడుల గురించి ఆలోచించి పార్టీలోకి తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios