హైదరాబాద్:రాష్ట్రం నుండి ఎవరెవరు ఇతర రాష్ట్రాలకు వెళ్లారనే విషయమై తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో సెకండరీ కాంటాక్టు లిస్టులను సేకరిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి చేరుకొన్నాయి. గురువారం నాడు ఒక్క రోజే 50 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

also read:గాంధీలో డాక్టర్ పై దాడి చేసిన కరోనా రోగి అరెస్ట్

మర్కజ్, దేవ్ బంద్ లింకులపై తెలంగాణ పోలీస్ శాఖ ఆరా తీస్తోంది. మర్కజ్, దేవ్‌బంద్ లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి సెకండరీ కాంటాక్టు లిస్టులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మర్కజ్ నుండి రాష్ట్రం నుండి సుమారు వెయ్యి మంది వెళ్లి వచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే వీరితో సన్నిహితంగా ఉన్నవారిని కూడ వైద్యులు పరీక్షించారు. అయితే మర్కజ్ తో పాటు దేవ్ బంద్ లింకులు కూడ ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లో  ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు గుర్తించడంతో దేవ్ బంద్ విషయం వెలుగుచూసింది. మర్కజ్, దేవ్ బంద్ కు వెళ్లి వచ్చిన వారి సెకండరీ కాంటాక్టు లిస్టులపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

వీరి సెల్ ఫోన్ లోకేషన్ల ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్రం విడిచి ఎంత మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారనే విషయాలపై వారిని పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. రానున్న వారం రోజుల్లో ఈ సమాచారాన్ని సేకరించాలని పోలీస్ శాఖ భావిస్తోంది.