తెలంగాణ ఉద్యమ కారుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

నారాయణగూడలోని తన ఇంటి వద్ద వేణుగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని వేణు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సర్కారు ఆగ్రహం చెందింది.

వెంటనే వేణును అరెస్టు చేయాలంటూ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వేణును శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు.

ఎన్.వేణుగోపాల్ గత కొంతకాలంగా తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నారు. తెలంగాణ సర్కారు వైఫల్యాల మీద అనేక ఆర్టికల్స్ రాశారు.

దీంతో తెలంగాణ సర్కారు వేణుగోపాల్ పట్ల గుర్రుగా ఉన్నట్లు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేవలం తెలుగు మహాసభలను బహిష్కరించాలని పిలుపునిచ్చింనత మాత్రాన అరెస్టు చేశారా?

లేక  పోలీసులు ఇంకేమైనా కారణాలు చూపుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. విరసం నేత, మావోయిస్టు సానభూతిపరుడు వరవరరావుకు వేణు స్వయాన మేనల్లుడు.

ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే నేలమీద ఒక తెలుగు రచయితను అరెస్టు చేయడం తెలంగాణ, ఆంధ్రా లో  చర్చనీయాంశమైంది.

వేణు అరెస్టుపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. సాయంత్రం నిరసన సభకు వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

అయితే పోలీసు వర్గాల్లో మాత్రం పిడి యాక్ట్ నమోదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

వేణుగోపాల్ అరెస్టుపై మరిన్ని వివరాాలు తెలియాల్సి ఉంది.