హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, నగర విస్తీర్ణం దృష్ట్యా రోడ్ల విస్తరణ చేపడుతున్నామని, ఇందులో భాగంగా ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు ఉన్న రక్షణ శాఖ స్థలాలు ఇస్తే ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, తాము గతంలో ఈ మేరకు కోరామని వినోద్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ కారిడార్‌తో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రవాణా సమయం కలిసి వస్తుందని కేంద్ర రక్షణ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల వేళా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ చర్చనీయాంశమైంది. తాజాగా తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం మరోసారి డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ తమకు అప్పగిస్తే జీహెచ్ఎంసీ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక నగరంలో జనాభాతోపాటు నగర విస్తీర్ణం కూడా పెరుగుతున్నదని వినోద్ కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రోడ్లు పెరుగుతున్నాయని వివరించారు. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులను వేసి కొత్త కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా రద్దీ పెరుగుతున్నందున ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు రోడ్డు విస్తరణ పనులకు రక్షణ శాఖ స్థలం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.
Also Read: మిషన్ కాకతీయపై అధ్యయనం.. తెలంగాణకు రానున్న పంజాబ్ బృందం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తగా రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్‌ల నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేరర్కొన్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, బోయిన్‌పల్లి నుంచి కొంపల్లి తరహాలో ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు ఉన్న రక్షణ శాఖ స్థలాలు ఇస్తే ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటామని కోరారు. తాము గతంలో ఈ విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. ఈ కారిడార్ నిర్మిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా అవుతుందని, కాబట్టి, ఇందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖను కోరారు.
