కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి ని ఎలా తరిమికొట్టాలా అని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నానా తిప్పలు పడుతున్నారు. వైద్యులు, సైంటిస్టులు వీటికి మందులు తయారీలో నిమగ్నమైపోయారు.

రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండగా.. మరణాలు సైతం అదేవిధంగా ఉన్నాయి. ఎవరికి వారు.. కరోనా సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి  ఒక్కరూ జాగ్రత్తగా ఉండటంతోపాటు.. తమ చుట్టూ ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితులు ఓ మహిళ చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ మహమ్మారి తన కోడలికి కూడా సోకాలని కోరుకుంది. కోరుకోవడం ఆగిపోలేదు.. కావాలని వెళ్లి ఆమెకు అంటించింది. బలవంతంగా.. కోడల్ని హగ్ చేసుకుంది. ఇంకేముంది.. ఆ కోడలికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె కోరుకున్నది జరిగిందుకు ఆ అత్తగారు చాలా సంతోషించడం గమనార్హం. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. కాగా.. ఆమె కావాలని కరోనా కోడలికి కూడా సోకేలా చేసింది. కోడలికి కూడా పాజిటివ్ రావడంతో.. ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఈ విషయం కాస్త సదరు యువతి తన సోదరికి చెప్పడంతో.. ఆమె సహాయంతో తన పుట్టింటికి చేరింది.

తన పుట్టింటికి చేరిన యువతి వీడియో కాల్ ద్వారా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. తన అత్తగారు.. కరోనా సోకిన తర్వాత.. తనను హగ్ చేసుకొని.. ‘ నీకు కూడా కరోనా సోకాలి అదే కోరిక’ అని చెప్పిందని.. ఆ కోడలు వాపోయింది.

అత్తకి కరోనా పాజిటివ్ రావడంతో.. ఇంట్లోవారమంతా ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టామని.. అలా సామాజిక దూరం పాటించడం ఆమె తట్టుకోలేకపోయిందట. అందుకే..  కావాలని కోడలికి కూడా కరోనా వచ్చేలా చేయడం గమనార్హం.

నేను కరోనాతో చచ్చిపోతే మీరంతా ఆనందంగా ఉందాం అనుకుంటున్నారా..? నేను ఉండనివ్వను అంటూ.. కోడలికి కరోనా అంటించడం గమనార్హం. ప్రస్తుతం సదరు కోడలు హోం ఐసోలేషన్ లో ఉంది. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది. కాగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.