ముందస్తు ఎఫెక్ట్: ఇతర పార్టీలతో పొత్తుల కోసం టిపిసిసి కమిటీ

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 7, Sep 2018, 8:12 PM IST
telangana pcc alliances committee
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతూ తమ అభ్యర్ధులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ దూకుడును చూసి ప్రతిపక్షాలు కూడా దూకుడును పెంచాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీలతో పొత్తులపై చర్చించేందుకు ఓ కమిటీని నియమించింది. 

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో పిసిసి పొత్తుల కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఇష్టపడుతున్న పార్టీలను మిత్రపక్షాలుగా మలుచుకునేందుకు చర్చలు జరపనుంది. రెండ్రోజుల్లో ఈ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు, పొత్తుల వల్ల లాభాలేమిటి వంటి విషయాలను చర్చించనున్నారు. దీని తర్వాతే ఈ కమిటీ ఏకాభిప్రాయంతో ఇతర పార్టీలతో చర్చలు జరిపి పొత్తులు కుదుర్చుకోనుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

loader