Asianet News TeluguAsianet News Telugu

అంగన్‌వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే : మంత్రి సత్యవతి రాథోడ్

Telangana: దేశంలో ఎక్క‌డా  లేని విధంగా తెలంగాణలో ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తూ.. మంచి పాల‌న అందిస్తున్నామ‌ని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అలాగే, దేశంలో అంగ‌న్‌వాడీల‌కు అత్య‌ధిక వేత‌నాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్క‌టేన‌ని పేర్కొన్నారు. 
 

telangana pays highest wages to anganwadis minister satyavathi
Author
Hyderabad, First Published Dec 21, 2021, 4:23 PM IST

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం.. దేశంలో ఎక్క‌డ‌లేని విధంగా ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ కార్య‌క్రామాలు, ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ద‌ని  రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీలకు గత ఏడేళ్లలో మూడు సార్లు వేతనాలు పెంచామ‌ని తెలిపారు. దేశంలో అంగ‌న్‌వాడీల‌కు  అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే  మంత్రి వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం నాడు మహబూబాబాద్ లో ఆమె ప‌ర్య‌టించారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంగన్‌వాడీలకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి మంత్రి నేత చీరలు పంపిణీ  చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఆమె పై వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడేండ్ల త‌మ పాల‌న‌లో అంగ‌న్ వాడీల మెరుగుకోసం అనేక చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.  అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం తన వాటాగా ఇస్తుంటే..కేంద్రం పావులా వంతు మాత్రమే ఇస్తున్న‌ద‌ని మంత్రి తెలిపారు.

Also Read: Rahul Gandhi: మోడీ స‌ర్కారు ఏర్ప‌డ్డాకే మూకదాడులు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అలాగే, రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ ప‌రిస్థితుల‌ను కూడా స్త్రీ- శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్  ప్ర‌స్తావించారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా అద్భుత సేవలు అందించినందుకు అంగ‌న్ వాడీ నిర్వాహాకుల‌ను  కొవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ మార్గదర్శనంలో కేంద్రాన్ని స్వయంగా  కోరామ‌ని తెలిపారు. దాని ఫ‌లితంగానే నేడు దేశ వ్యాప్తంగా అంగన్‌వాడీలకు 50 లక్షల రూపాయల బీమా వర్తించింది  ఆమె పేర్కొన్నారు. అంగ‌న్‌వాడీ సిబ్బంది వేత‌నాల గురించి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా  తెలంగాణ  రాష్ట్రంలోనే అంగన్‌వాడీలకు అత్య‌ధికంగ వేత‌నాలు ఇస్తున్నామ‌న్నారు. అలాగే,  నేత చీరలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 67,411 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలుకు చీరలు ఇస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీలను సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. అలాగే, మారుమూల ప్రాంతాల ప్ర‌జ‌ల ఆరోగ్యంపైనా రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని పేర్కొన్నారు. దీనిలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన బిడ్డలకు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బలామృతంతో కూడిన పోషకాహార భోజనాన్ని అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Also Read: AP: బీ ఫార్మసీ విద్యార్థిపై కత్తితో దాడి.. విజయనగరంలో ఘటన

ఇదిలావుండ‌గా,  ధాన్యం కొనుగోలు విష‌యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం.. కేంద్రం తీరును ఎండ‌గ‌డుతూ.. ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం నాడు మహబూబాబాద్ లో నిర్వ‌హించిన ఆందోళ‌న‌ల్లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ పాల్గొన్నారు.  వ్యవసాయంపై అవగాహన లేని నాయకుల వ‌ల్ల  దేశంలో రైతుల కష్టాలు ఎప్పటికీ మారవని అన్నారు. రైతుల కష్టాలను ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఏడాది కాలంగా రైతులు చేస్తున్న నిరసన నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదు. రైతులు నిరసనల ద్వారా గుణపాఠం చెప్పిన తర్వాతే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. తెలంగాణలో రైతులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ. వరిధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు. త‌న బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తోంది' అని రాథోడ్‌ అన్నారు. ఖరీఫ్‌లో దాదాపు 62 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 70 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది, అయితే 40 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని పట్టుబడుతోంది. మరోవైపు, రాష్ట్రం ఇప్పటి వరకు రైతుల నుంచి 52 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది అని చెప్పారు.

Also Read: Omicron: భార‌త్ లో ఒమిక్రాన్ డ‌బుల్ సెంచ‌రీ !

Follow Us:
Download App:
  • android
  • ios