కృష్ణా నదీ నీటి యాజమాన్య బోర్డును విశాఖకు తరలించవద్దని కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సంబంధం లేని ప్రాంతంలో బోర్డును ఏర్పాటు చేయడం తగదని పేర్కొంది.

కృష్ణా నదీ నీటి యాజమాన్య బోర్డును విశాఖకు తరలించవద్దని కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సంబంధం లేని ప్రాంతంలో బోర్డును ఏర్పాటు చేయడం తగదని పేర్కొంది.

బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే గతంలో ఒప్పుకున్నామని.. కానీ ఇప్పుడు సంబంధంలో లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ రావు తెలిపారు.

అపెక్స్ కమిటీలో చేర్చించకుండా ఇప్పుడు విశాఖలో బోర్డును ఏర్పాటు చేస్తామనడం సమంజసం కాదన్నారు. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలకమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏడాది క్రితమే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించారు. ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి.

కానీ ఆ తర్వాత వైసీపీ సర్కారు రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో బోర్డు కార్యాలయాన్ని కూడా వైజాగ్‌లో పెట్టాలని కోరుతోంది. కీలకమైన కృష్ణాబోర్డు కార్యాలయం రాజధాని ప్రాంతం నుంచి పనిచేస్తేనే బావుంటుందని వైసీపీ సర్కారు చెబుతోంది.