అమ్మకు ప్రేమతో.. చంద్రుడిపై భూమి కొనుగోలు చేసిన తెలంగాణ ఎన్నారై
Karimnagar: తెలంగాణ ఎన్నారై తన అమ్మ కోసం చంద్రుడిపై భూమి కొనుగోలు చేశారు. 'ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీ' నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎన్నారైలు పత్రాలను అందుకున్నారు. తనకు అమ్మ అంటే ఎంతో ఇష్టమనీ, తనకు ప్రేమను ఎలా చెప్పాలనే ఆలోచనలో తల్లికి చిరస్మరణీయ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే జాబిల్లిపై తన తల్లి పేరు మీదుగా ఒక ఏకరం భూమి కొనుగోలు చేసినట్టు తెలిపారు.
Telangana NRI purchases land on Moon for mom: తెలంగాణ ఎన్నారై తన అమ్మ కోసం చంద్రుడిపై భూమి కొనుగోలు చేశారు. 'ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీ' నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎన్నారైలు పత్రాలను అందుకున్నారు. తనకు అమ్మ అంటే ఎంతో ఇష్టమనీ, తనకు ప్రేమను ఎలా చెప్పాలనే ఆలోచనలో తల్లికి చిరస్మరణీయ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే జాబిల్లిపై తన తల్లిపేరు మీదుగా ఒక ఏకరం భూమి కొనుగోలు చేసినట్టు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన అమెరికాలో స్థిరపడిన ఓ మహిళా ఎన్నారై తన తల్లి కోసం చంద్రుడిపై భూమి కొనుగోలు చేశారు. 'ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీ' నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ఆమెకు డాక్యుమెంట్లు అందడంతో ఈ విషయం వెల్లడించారు. గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రామచంద్రం, వకుళాదేవి దంపతుల కుమార్తె సాయివిజ్ఞ అమెరికాలోని లోవా స్టేట్ గవర్నర్ కింబర్లీ కే రోనాల్డ్స్ కు ప్రాజెక్ట్ మేనేజర్ గా, ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు.
న్యూయార్క్ లోని 'ఇంటర్నేషనల్ లూనార్ రిజిస్ట్రీ'కి సంబంధించిన వెబ్ సైట్ ద్వారా చంద్రుడిపై భూమికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలుసుకున్న ఆమె తన ఎదుగుదలకు కృషి చేసిన తన తల్లికి చిరస్మరణీయ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే మదర్స్ డే రోజున సాయి విజ్ఞ తన తల్లి వకుళా దేవి, కుమార్తె అర్థ పేరిట లూనార్ రిజిస్ట్రీతో చంద్రుడిపై ఒక ఎకరం భూమి కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎకరానికి రూ.3 లక్షలకు కొనుగోలు చేసిన చంద్రుడి భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్నారు.