తెలంగాణ నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. చెన్నై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తమిళిసై చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు... అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు తదితరులు సౌందరరాజన్‌కు ఘనస్వాగతం పలికారు.

ఆనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. బేగంపేట నుంచి తమిళిసై రాజ్‌భవన్ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె తెలంగాణ రెండో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్‌ ప్రమాణం చేయిస్తారు.