తెలంగాణ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్ బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్.. గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో నిన్నటి వరకు సీఎస్‌గా విధులు నిర్వర్తించిన శైలేంద్ర కుమార్ జోషి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. 

Also Read:తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేష్‌కుమార్‌

తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేష్‌కుమార్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 14 మంది స్పెసల్ చీఫ్ సెక్రటరీలు ఈ పదవి కోసం పోటీపడ్డారు. ప్రధానంగా అజయ్ మిశ్రా, సోమేష్‌కుమార్ మధ్యే పోటీ నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సోమేష్‌కుమార్‌ వైపు మొగ్గు చూపారు. 1989 బ్యాచ్‌కు చెందిన సోమేష్ కుమార్  బీహార్ రాష్ట్రానికి చెందినవాడు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు రాత్రి సీఎస్ ఎంపికపై కసరత్తు నిర్వహించారు. సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా పేరు కూడ సీఎస్ రేసులో విన్పించింది.కానీ, చివరకు కేసీఆర్ సోమేష్ కుమార్ వైపు మొగ్గు చూపారు. 

Also Read:తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?: రేసులో వీరే...