Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy: తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి! సీఎం రేవంత్‌తో శంకరమ్మ భేటీ

తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సీఎం రేవంత్ రెడ్డితో ఈ రోజు సచివాలయంలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ జరగడం ఆసక్తికరం. ఆమెకు ఓ కీలక పదవి దక్కనున్నట్టు తెలుస్తున్నది.
 

telangana movement agitator, martyr srikanthachari mother shankaramma met cm revanth reddy, may get key post kms
Author
First Published Jan 2, 2024, 8:27 PM IST

Nominated Post: తెలంగాణ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సచివాలయంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలో ఆమెతో సీఎం భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. శంకరమ్మకు ఓ కీలక పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నామినేటెడ్ పోస్టు లేదా.. చట్టసభలకు ఎమ్మెల్సీగానూ ఆమెను పంపించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి.

శంకరమ్మతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తనను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. శంకరమ్మను గుర్తించి ఉద్యమకారుల మద్దతునూ చూరగొనే ప్లాన్ వేసింది. 

తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారిని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. శ్రీకాంతాచారి అమరత్వంతో తెలంగాణ ఉద్యమం మరింత ఎగసిపడింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తగిన గుర్తింపు లభిస్తుందని, ప్రభుత్వంలో ఆమెకూ పాత్ర ఉంటుందని చాలా మంది భావించారు, ఆశించారు. కానీ, అదే తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మాత్రం ఈ ఆశలను నెరవేర్చలేదు. పలుమార్లు మొండిచేయే చూపింది.

Also Read : బ్యాంకు దోపిడీకి ప్లాన్ వేసి.. పోలీసు లాకప్‌లోకి వెళ్లినట్టు.. బ్యాంకు బయటి నుంచి తాళం వేయడంతో గిలగిల..

ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర క్రెడిట్ బీఆర్ఎస్‌ది కాదని, కాంగ్రెస్సే తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెబుతున్న హస్తం నేతలు ఉద్యమకారులను ఓన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను తమ వైపు తిప్పుకోవడం నిజానికి బీఆర్ఎస్‌ను చావుదెబ్బతీసినట్టే అవుతుంది. ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ బీఆర్ఎస్ గెలువొచ్చు. కానీ, తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి ఆయువు పట్టువంటిది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios