Hyderabad: హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో ఫాక్స్ కాన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణానికి నాంది పలుకుతూ నెల రోజుల క్రితమే భూమిపూజ జరిగింది. ప్రాజెక్టు శరవేగంగా అభివృద్ధి చెందడాన్ని అభినందించిన మంత్రి, సైట్ లో జరుగుతున్న పనులను వివరిస్తూ ట్విటర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. 

Telangana Model Development: తెలంగాణ మోడ‌ల్ అంటే సమ్మిళిత, సమగ్ర, సమతూకంతో కూడిన తెలంగాణ అభివృద్ధి నమూనా అనీ, వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఇది ఎంతో దోహదపడుతుందని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) అన్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తంచేశారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గత అక్టోబర్ లో జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతూ.. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) గా మారింది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలంగాణ పాలనా విధానం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసున‌ని అన్నారు. ఎవరు మెరుగైన పాలన అందించగలరో రాష్ట్ర ప్రజలకు తెలుసనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్రానికి ఏం ఇవ్వగలరో అలాంటి సమర్థులు ప్రతిపక్షంలో ఎవరూ లేరని అన్నారు. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయనీ, అయితే దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాలకు సమానమైన, మెరుగైన పాలనా నమూనాను ఎక్కడా ఆ రెండు పార్టీలు ప్రదర్శించలేదన్నారు.

ఇదిలావుండ‌గా, హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో ఫాక్స్ కాన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మాణానికి నాంది పలుకుతూ నెల రోజుల క్రితమే భూమిపూజ జరిగింది. ప్రాజెక్టు శరవేగంగా అభివృద్ధి చెందడాన్ని అభినందించిన మంత్రి, సైట్ లో జరుగుతున్న పనులను వివరిస్తూ ట్విటర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న వేగాన్ని వివరించడానికి 'తెలంగాణ స్పీడ్' అనే పదాన్ని రూపొందించిన ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు నుంచి కూడా ఈ ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫాక్స్కాన్ బృందం అసాధారణ పనితీరును కనబరుస్తోందనీ, ఇది వేగవంతమైన పురోగతికి మరింత దోహదం చేస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.