మరో వివాదంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని (వీడియో)

Telangana mla intimidates woman in Velama bhavan issue
Highlights

వెలమ భవన్ శంకుస్థాపనలో మహిళను బెదిరించిన గులాబీ ఎమ్మెల్యే

టిఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ద్వంద పౌరసత్వం విషయంలో ఆయన న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మరో వివాదంలో చెన్నమనేని నిలిచారు. ఆ వివరాలు చదవండి. వీడియో కూడా చూడండి.

వేములవాడలో వెలమ సంక్షేమ భవన్ నిర్మాణం విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. స్థానికులు వెలమ సంక్షేమ భవన్ నిర్మాణం చేపట్టరాదంటూ ఆ భవన నిర్మాణానికి ఫౌండేషన్ వేసే సమయంలో అడ్డుకుని నిరసన తెలిపారు. అయితే స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే (వెలమ కులానికి చెందిన వ్యక్తి) చెన్నమనేని రమేష్ ఆందోళన చేసే మహిళలను బెదిరించారు. ష్... అంటూ వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు.

భూమిపూజ చేయకుండా అడ్డుకుంటున్న మహిళలను, స్థానికులను పోలీసులు అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కోర్టు కేసులో ఉన్న భూమిలో వెలమ కుల భవనానికి ఎలా భూమిపూజ ఎలా చేస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరుగుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరూ చూడండి. వీడియో.

loader