కామారెడ్డి జిల్లా టెక్రియాల్ చెరువులో మంత్రులు తలసాని, పోచారం శ్రీనివాస్ రెడ్డి చేప పిల్లలను వదిలిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో మత్స్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. కానీ ఇప్పుడు మత్య్సకారుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని మంత్రులు తెలిపారు.

మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఉచితంగా 80 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేశామని మంత్రులు స్పష్టం చేశారు. మత్స్య సంపదను రక్షించుకుని మత్స్యకారులు అభివృద్ధి చెందాలని.. తక్కువ ధరకు చేపలు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు.

కామారెడ్డిలో 10 లక్షల రూపాయలతో చేపల మార్కెట్‌ను నిర్మిస్తామని, 1100 కోట్లతో మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. త్వరలో మత్స్యకార సహకార సోసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

"