బీజేపీ నేతలా మాట్లాడుతున్నారు: గవర్నర్ పై తలసాని ఫైర్
సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సెప్టెంబర్ 17 వ తేదీని విమోచన దినం అని గవర్నర్ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.
జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నాడు హైద్రాబాద్ లో జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
పాల్గొన్నారు. ర్యాలీని పురస్కరించుకొని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.సెప్టెంబర్ 17 వ తేదీ జాతీయ సమైక్య దినమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినమని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు.
also ead:విలీనం ,విమోచనమంటూ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా
సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్య దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులంతా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ తదితరులు పాల్గొన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో హైద్రాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాలేదన్నారు. ఆనాడు నిజాం పాలనలో హైద్రాబాద్ సంస్థానం ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17 న రాచరికపు వ్యవస్థనుండి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టినందున జాతీయ సమైఖ్యత దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. జాతీయ సమైక్యత దినోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నిజాం సంస్థానం భారత్ లో విలీనమైన రోజు రేపటితో 75 ఏళ్లు పూర్తి కానుందన వజ్రోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై వ్యవహరించిన తీరును మంత్రి తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ కార్యక్రమమైనా నిర్వహించవచ్చన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకొని హైద్రాబాద్ లో విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహించనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర సీఎంలను కూడా కేంద్రం ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఇవాళ రాత్రికి అమిత్ షా హైద్రాబాద్ కు వస్తారు.