ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన తిమ్మిని బమ్మిని చేయగలరని, ఆయన ట్రాప్‌లో పడిన కొన్ని మీడియా సంస్థలు కూడా తిమ్మిని బమ్మిని చేయాలనుకుంటున్నాయని తలసాని మండిపడ్డారు.

ఐటీ గ్రిడ్‌కు సంబంధించిన వాస్తవాలు ప్రజల దృష్టికి తేవాలని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఐటీ గ్రిడ్ కేసును రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా కొందరు తెలిసి, తెలియక చిత్రీకరిస్తున్నారన్నారు.

ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయటం దౌర్భాగ్యమన్నారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్నాయని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ కూడా 24 లక్షల ఓట్లను తొలగించి గెలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కొన్ని సార్లు తమ డేటా చోరీ అయిందని, మరికొన్నిసార్లు కాలేదని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పూటకో మాటతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

జర్నలిస్టు సంఘాలు ఒక కమిటీ వేసుకుని ఐటీ గ్రిడ్‌పై నిష్పాక్షికంగా విచారణ చేసి ప్రజలకు వాస్తవాలు చెబితే మంచిదని తలసాని మీడియాకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి అధికారులను బలీ చేయాలని చూస్తోందని... డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించినది కాదని, అది ఏపీ ప్రజల డేటా అని లోకమంతటికి తెలుసునన్నారు.

ఏపీలో ఎమ్మెల్యేలను, మంత్రులను, వ్యవస్ధలను చంద్రబాబు ముంచేస్తారని... బాధ్యత లేకుండా వ్యవహరించడం ఎవరికీ మంచిది కాదని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. 

తెలంగాణ డేటా దొరికింది: ఐటీ గ్రిడ్‌పై స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యలు

ట్యాబ్ పట్టుకున్నప్పుడే మొత్తుకున్నాం: ఐటీగ్రిడ్స్‌పై బొత్స ఫైర్

జనవరి 11 తర్వాత ఒక్క ఓటు తొలగించలేదు: ద్వివేది

టీడీపీ అధికారిక వెబ్ సైట్ క్లోజ్.. కారణం అదేనా..?

కేంద్రం, తెలంగాణ సర్కార్లు టెర్రరిస్టులు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు