Asianet News TeluguAsianet News Telugu

ఆ జీవోల ప్రకారమే నీటి వినియోగం:ఏపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.  కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.

Telangana minister srinivas goud fires on AP government lns
Author
Hyderabad, First Published Jul 2, 2021, 2:39 PM IST

హైదరాబాద్: అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.  కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.

also read:జలవివాదం: ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి

ఏ అనుమతులు లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని  ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవోల ప్రకారంగానే తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకొంటుందని ఆయన చెప్పారు.విద్యుత్ ప్రాజెక్టులున్న దగ్గర నుండి నీటిని వాడుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తాము సెటిలర్స్ అనే పదం వాడలేదన్నారు. ఏపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios