హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  సీబీఐ కోర్టులో సోమవారం నాడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.  ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిపై సీబీఐ అభియోగాలు నిరాధారమని మంత్రి తరపున లాయర్ వాదించారు.

ఈ పిటిషన్ పై ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.ఓఎంసీ కేసులో  మాజీ ఐఎఎస్ అధికారి కృపానందం తన పేరును అన్యాయంగా ఇరికించారని  గత వారంలో కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

తొలి రెండు చార్జీషీట్లలో తన పేరును చేర్చారని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఓఎంసీ కేసు అప్పట్లో రాజకీయంగా సంచలనమైన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిపై అప్పట్లో  ఈ కేసు నమోదైంది. ఈ కేసులో కొందరు అధికారుల పేర్లు కూడ ఉన్నాయి.ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.