వరంగల్ లో మంత్రి పోచారం స్టయిల్ అదుర్స్

telangana minister pocharam new style in warangal
Highlights

మండుటెండలో హల్ చల్

వర్ధన్నపేట కేంద్రంలో జరిగిన రైతుబంధు చెక్కులు మరియు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి, MP పసునూరి దయాకర్, వర్ధన్నపేట శాసనసభ్యుడు ఆరూరి రమేష్,  అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. పోచారం మాట్లాడుతూ ఏమన్నారంటే?

 

రైతుబంధు పథకం ద్వారా ఈ వానాకాలంలో రాష్ట్రంలోని  58 లక్షల మంది రైతులకు రూ. 5730 కోట్లు అందిస్తున్నాం.  ఇప్పటికే రైతులు రూ. 4500 కోట్లు డ్రా చేసుకున్నారు. గతంలో రైతులు పంటలు వేయడానికి అప్పులు తెచ్చేవారు. అప్పులు చేసి రైతుల ఆత్మాభిమానం దెబ్బతినకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి  కేసీఆర్ గారు పంటలకు పెట్టుబడిని ఇస్తున్నారు. వానాకాలం, యాసంగి కలిపి రూ. 8000 ఇస్తాం. యాసంగి కోసం నవంబర్ 18 నుండే అందిస్తాం. వృద్దులు, వికలాంగులకు చెక్కులను అధికారులు ఇంటికే వెళ్ళి అందిస్తారు. జూన్ 2 నుండి రైతులకు రూ. 5 లక్షల భీమాను ప్రారంభిస్తాం. భీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి70 ఏళ్ళయినా రైతులు ఇంకా అప్పులలోనే ఉన్నారు. నాయకులు 70 ఏళ్ళ నుంచి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చి పదవులు, ఆస్థులు పెంచుకున్నారు. ఇతర రంగాల వారు తమ పిల్లలకు ఆస్థులు అందిస్తే రైతులు మాత్రం తమ వారసులకు అప్పులు ఇస్తున్నారు.

 

నేడు ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలను గతంలోనే మీరు అమలు చేసి ఉంటే నేడు రైతుల పరిస్థితి ఇలా ఉండేదా ???.  గతంలో నీటితీరువా కట్టకపోతే రైతుల ఇంటి తలుపులు పీక్కొనిపోయోవారు.. నేడు ముఖ్యమంత్రి గారు నీటితీరువా రద్దు చేసి ఉల్టా ఎకరాకు రూ.4000 ను అందిస్తున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయం దండగ కాదు పండుగ అనేలా చేస్తాం.  మనసున్న మహారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 42 లక్షల మంది వృద్దులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.5,500 కోట్ల పింఛన్లను అందిస్తున్నాం. పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి తల్లిదండ్రులు అప్పులు చేయకుండా ప్రభుత్వమే రూ. 1,0116 అందిస్తుంది. త్వరలోనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కళ్ళ పరీక్షలు చేయిస్తాం. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ రెడ్డి కి కళ్ళతో పాటు చెవులు కూడా పని చేయడం లేదు. 2019 ఎన్నికల నాటికి ఇంటింటికీ త్రాగునీరు  అందిస్తామని ముఖ్యమంత్రి వాగ్ధానం చెస్తే ఈయనెమో మూడేండ్లలో అని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మిషన్ భగీదధ పథకం ద్వారా త్వరలోనే ఇంటింటికీ త్రాగునీరు అందిస్తాం. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతీ వ్యక్తి మా బిడ్డనే. ప్రతి తెలంగాణ బిడ్డ మోహంలో సంతోషం చూడాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆశయం.

loader