తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కొందరు వ్యక్తులు బెదిరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మంత్రి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వాసు అనే లారీడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud) హత్యకు కుట్రపన్నిన (conspiracy to murder) వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే మరో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి (minister malla reddy) కొందరు బెదిరింపు కాల్స్ చేశారు. అర్ధరాత్రి పలువురు దుండగులు అసభ్య మెసేజ్‌లు చేశారు. దీంతో బోయిన్‌పల్లి పోలీసులకు మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విజయవాడకు చెందిన లారీడ్రైవర్ వాసును అరెస్ట్ చేశారు.
కాగా.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కొందరు పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఈ కేసులో పోలీసులు మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజును, ఆయన సోదరులను, ఇతరులను అరెస్ట్ చేయడం తెలిసిందే. మంత్రి వేధింపులను భరించలేకే హత్యకు కుట్ర పన్నామని వారు వెల్లడించినట్టు కథనాలు వచ్చాయి. కాగా, నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారిని 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిందితులను న్యాయవాదుల సమక్షంలో విచారించాలని పోలీసులకు సూచించింది. అలాగే విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది.
ఇకపోతే.. మంత్రి హత్య కుట్ర కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలను సేకరించారు. మహబూబ్‌నగర్ లోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. మహబూబ్ నగర్ లో ఎక్కడ చంపాలనే దానిపై కూడా నిందితులు నిర్ణయం తీసుకొన్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
బహదూర్‌పల్లి లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను kill చేసేందుకు ఉపయోగంచాలనుకొన్న ఆయుధాలను దాచిపెట్టారు. Raghavender Raju, మున్నూరు రవిలు ఈ ఆయుధాలను దాచి పెట్టినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. గత ఏడాది ఆగష్టు 3వ తేదీన రాఘవేందర్ రాజు ఇంట్లోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ ను Mahabubnagar లోనే హత్య చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. మహబూబ్‌నగర్ లో ఎక్కడ హత్య చేయాలనే దానిపై కూడా నిందితులు పక్కా స్కెచ్ వేశారని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
మంత్రి హత్య కుట్ర కేసులో ఏ1 గా రాఘవేందర్ రాజును పోలీసులు పేర్కొన్నారు. ఏ 5గా మున్నూరు రవి, ఏ6 గామధుసూధన్ రాజు, ఏ7 గా అమరేందర్ రాజు, ఏ 8 జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను పోలీసులు చేర్చారు.పేట్ బషీరాబాద్ లో పోలీసులు కేసు నమోదు చేయగానే నిందితులు విశాఖపట్టణం వెళ్లారని పోలీసులు తెలిపారు. విశాఖపట్టనం నుండి ఢిల్లీకి నిందితులు చేరుకొన్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పారు.
శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలనే కుట్ర బయటకు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఆయనకు భద్రతను పెంచారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఒక పైలెట్ వాహనంతో పాటు 10 మందితో భద్రతను కల్పిస్తున్నారు. హత్య కుట్ర బయటకు రావడంతో భద్రతను పెంచింది Police department. రెండు పైలెట్ వాహనాలతో పాటు 20 మంది సెక్యూరిటీ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.
