తెలంగాణ మంత్రికి కొత్త జోన్ల సెగ

Telangana minister Mahender Reddy faces protest
Highlights

కాక మీదున్న తెలంగాణ యూత్

తెలంగాణ సర్కారు నిర్ణయించిన కొత్త జోన్లు, మల్టీ జోన్లపై యూత్ గుర్రుగా ఉన్నారు. లెక్క పత్రం లేకుండా కొత్త జోన్లు నిర్ణయించారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూత్ మరింత ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చేది గాలికొదిలి జోన్లు, మల్టిజోన్లు, జిల్లాల పేరుతో తెలంగాణ సర్కారు కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి జోన్ల సెగ తగిలింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనేందుకు కుల్కచర్ల మండలం లో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీంతో జోగులాంబ జోన్లో వికారాబాద్ జిల్లా ను చేర్చోదంటూ మంత్రిని అడ్డుకున్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ  జెఎసి నాయకులు. ఈ సందర్భంగా ఫ్లకార్డులతో నినాదాలతో నిరసన తెలిపారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి కి వారు వినతిపత్రం సమర్పించారు. జోగులాంబ జోన్లో చేర్చడాన్ని వ్యతిరేకించాలని వినతిపత్రంలో కోరారు.

loader