చేనేత, టెక్స్ టైల్స్ వస్త్రాలపై 12 శాతం జీఎస్టీ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 5 నుండి 12 శాతానికి జీఎస్టీ పన్నును పెంచడం వల్ల చేనేత రంగం కుదేలయ్యే అవకాశం ఉందన్నారు.
హైదరాబాద్: చేనేత, టెక్స్ టైల్స్ వస్త్రాలపై జీఎస్టీ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర మంత్రి Piyush Goyal కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు letter రాశారు. Corona తో handloom వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని మంత్రి Ktr ఆ లేఖలో పేర్కొన్నారు. జీఎస్టీ పన్నును 5 నుండి 12 శాతానికి పెంచాలని ప్రతిపాదించడం సరికాదన్నారుGst పన్ను పెంచితే చేనేత రంగం కుదేలయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
also read:లంచం తీసుకొంటూ చిక్కిన జీఎస్టీ సూపరింటెండ్: అరెస్ట్ చేసిన సీబీఐ
జీఎస్టీ ప్రోత్సాహకాలు కల్పించాల్సిన సమయంలో జీఎస్టీ పెంపు సరికాదన్నారు.చేనేత వస్త్రాలపై జీఎ(స్టీని 12 శాతం పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2022 జనవరి 1 నుండి ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.జీఎస్టీ కౌన్సిల్ చైర్మెన్ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ ఏడాది సెప్టెంబర్ 17న నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.చేనేత వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. వస్త్ర వ్యాపారులు పలు రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు.ఇప్పటికే నష్టాల్లో ఉన్న చేనేత వ్యాపారులు జీఎస్టీ పన్ను పెంపుతో వ్యాపారం నుండి బయటకు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
జీఎస్టీని 5 నుండి 12 శాతం పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ తమిళనాడు మధురైలోని సుంగుండి వస్త్ర వ్యాపారులు తమ వ్యాపారాన్ని మూసివేయాలనే యోచనలో ఉన్నారనే ప్రచారంలో ఉంది. జీఎస్టీ పన్ను పెంపు తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మధురైకి చెందిన వస్త్ర వ్యాపారి మణికంఠన్ చెప్పారు.మరో వైపు తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చేనేత వస్త్రాల వ్యాపారి కర్నాటి నరసింహం కూడా జీఎస్టీ పన్ను పెంపుతో తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. ఈ వ్యాపారాన్ని వదులుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
