తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఆ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు ఆంధ్రప్రదేశ్‌‌లో అడుగుపెట్టనున్నారు. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యలతో కలిసి ఆయన బెజవాడ వెళ్తున్నారు.. ఈ పర్యటనలో ఆయన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకోనున్నారు.. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు పున్నమి ఘాట్‌లోని టూరిజం రిసార్ట్స్‌లో బస ఏర్పాట్లు చేసింది.. కేటీఆర్ పర్యటన దృష్ట్యా పున్నమి ఘాట్ పరిసరాలతో పాటు దుర్గ గుడి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.