తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేయబొమ్మంటూ దరఖాస్తుదారులకు ఊరటనిచ్చారు. 

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేయబొమ్మంటూ దరఖాస్తుదారులకు ఊరటనిచ్చారు.

ఎల్ఆర్ఎస్ ఫీజులు తగ్గిస్తామని, రిజిస్ట్రేషన్ సమయంలో మార్కెట్ వాల్యూ ప్రకారమే ఫీజులు ఉంటాయని చెప్పారు కేటీఆర్. బుధవారం అసెంబ్లీలో దీనిపై ప్రసంగించిన మంత్రి శాస‌న‌స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి.. రేపే జీవోను విడుద‌ల చేస్తామ‌న్నారు.

గ‌తంలో ఎప్పుడైతో వారు రిజిస్ర్టేష‌న్ చేసుకున్నారో వాటి వాల్యూకు అనుగుణంగానే స‌వ‌రించిన జీవోను విడుదల చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. అనధికారిక లే అవుట్లలో తెలియక ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవ‌చ్చు.

Also Read:గుడ్‌న్యూస్: ఎల్ఆర్ఎస్‌ మార్గదర్శకాలు ఇవీ...

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమ‌ని మంత్రి కేటీఆర్ ఇటీవ‌లే చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ని సద్వినియోగం చేసుకుంటే.. యాజమానులు భూములపై సర్వహక్కులతోపాటు ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు.