Hyderabad: లోక్‌సభ సెక్రటేరియట్ ఇటీవ‌ల‌ విడుదల చేసిన కొత్త బుక్‌లెట్ ప్రకారం.. అన్ పార్ల‌మెంటరీ పదాల‌ను  ఉపయోగించడం అనుచిత ప్రవర్తనగా పరిగణించబడుతుంద‌నీ,  సభా కార్యకలాపాలలో భాగం కాద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలోనే కొన్ని ప‌దాల‌ను ప్ర‌స్తావించింది. 

Telangana: త‌ర్వార‌లో పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలోనే లోక్‌సభ సెక్రటేరియట్ ఇటీవ‌ల‌ విడుదల చేసిన కొత్త బుక్‌లెట్ ప్రకారం.. అన్ పార్ల‌మెంటరీ పదాల‌ను ఉపయోగించడం అనుచిత ప్రవర్తనగా పరిగణించబడుతుంద‌నీ, సభా కార్యకలాపాలలో భాగం కాద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలోనే కొన్ని ప‌దాల‌ను ప్ర‌స్తావించింది. ఈ జాబితాలో చేర్చబడిన పదాలు, వాక్యాలు 'అన్‌పార్లమెంటరీ ఎక్స్‌ప్రెషన్' వర్గంలో చేర్చారు. వాటిలో జుమ్లాజీవి, కరోనా వ్యాప్తి, జైచంద్, శకుని, జైచంద్, లాలీపాప్, చందల్ క్వార్టెట్, గుల్ ఖిలాయే, పిట్టు, అరాచకవాది, వినాశ్‌పురుష్, ఖలిస్థానీ, చీటర్, నికమ్మా, బేహ్రీ సర్కార్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, బ్లడ్‌షెడ్, డాంకీ వంటి పదాలు ఉన్నాయి. 

ఈ అంశం రాజ‌కీయ దుమార‌మే రేపుతోంది. వాక్ స్వాతంత్య్ర హ‌రించే విధంగా ఈ నిర్ణ‌యాలు ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ శాఖ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్‌) మాట్లాడుతూ.. కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదుర‌య్యే మాట‌ల యుద్ధాన్ని ఆపేందుకు మోడీ స‌ర్కారు ఈ నిర్ణయం తీసుకున్న‌ద‌ని పేర్కొంటూ.. ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించే వారిని ఉద్దేశించి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) సభ్యులు ఉపయోగించిన కొన్ని అవమానకరమైన పదాలను కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2021లో వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్న రైతులను ప్రధాని వివరించడానికి ఉపయోగించిన “ఆందోళన్ జీవి వంటి ప‌దాల‌తో పాటు టెర్ర‌రిస్టులు, గోలీ మారో సాలో కో వంటి వ‌ర్డ్స్ ఉన్నాయి. ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యంత్ చేసిన “80-20” వ్యాఖ్య కూడా కేటీఆర్ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. పార్లమెంటులో నిషేధించబడిన పదాల జాబితాను వివరించే కోల్లెజ్‌ను కూడా మంత్రి పంచుకున్నారు.

Scroll to load tweet…


పార్లమెంట్‌లో పదాల వాడకంపై కేంద్రం నిషేధం విధించడంపై రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌ధాని మోడీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. జూలై 18న జరగనున్న వర్షాకాల సమావేశానికి ముందు ఈ అన్ పార్ట‌మెంట‌రీ పదాల జాబితాను లోక్‌సభ సెక్రటేరియట్ విడుద‌ల చేసింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, టీఎంసీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…