Asianet News TeluguAsianet News Telugu

దేశంలో పది వేల మంది ఫోన్లు ట్యాప్.. కిషన్ రెడ్డిది కూడా : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో 10వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని... కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ని అమలు చేస్తామని.. గుజరాత్ మోడల్ ఫెక్ మోడల్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

telangana minister ktr sensational comments on phone tapping
Author
First Published Oct 7, 2022, 4:10 PM IST

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 10వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని... కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని చెప్పారు. బీజేపీ మల్టీ ఫేసెడ్ పార్టీ అని.. బీజేపీ నేషనల్ పార్టీ అయినా నడిపించేది మాత్రం గుజరాతీలేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే దేశ ప్రజలకు తెలుసునని... తమ ఫోకస్ 2024 లోకసభ ఎన్నికలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే స్థితిలో వుందని.. తమకు టైం, సమయం ఇవ్వాలని మంత్రి కోరారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ని అమలు చేస్తామని.. గుజరాత్ మోడల్ ఫెక్ మోడల్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్, ఇంటింటికీ శుద్ధమైన త్రాగు నీరు, దళిత బంధు వంటి కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని కేటీఆర్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వాళ్ళ జిల్లాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌‌కు మద్దతు పెరుగుతోందని కేటీఆర్ తెలిపారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల పైన ఉన్న కేసులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ తీరు వాషింగ్ పౌడర్ నిర్మా లాగానే ఉందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.

Also REad:మాపై దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ప్రయోగిస్తారు:కేటీఆర్ సంచలనం

తమపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను వేట కుక్కల్లా ప్రయోగించే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అన్నింటికి తాము సిద్దంగా ఉన్నామన్నారు.  బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసినందున తమపై కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు  ఆ పార్టీని వీడనున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్  విఫలమైందని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని కేటీఆర్ సెటైర్లు వేశారు. కేరళలో రాహుల్.. భారత్ జోడోయాత్ర చేస్తుంటే గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క బీజేపీలో  చేరారని కేటీఆర్ తెలిపారు.

దేశంలో రాజకీయ శూన్యత ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు తమ పార్టీ పేరు మార్చుకున్నామన్నారు.  బీఆర్ఎస్  జాతీయ పార్టీగా ఎదుగుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ రూ. 22వేల కోట్ల కాంట్రాక్టు  తీసుకుందన్నారు. రూ. 5 వేల కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు మాట ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios