Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్.. ఎన్డీఏ అంటే నో డేటా ఆవేలేబుల్ ప్రభుత్వం... కేటీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలే అన్నారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ వరస క్రమంలో మొదటి స్థానమే కాదు.. రైతుల ఆత్మహత్యల్లో కూడా మొదటి స్థానంలో నిలిచిందని... దిగుబడుల్లో చివరి స్థానంలో ఉందని అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి ఎంత మారిందో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలన్నారు.

telangana minister ktr sensational comments on nda governament
Author
Hyderabad, First Published Jan 10, 2022, 1:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి KTR తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ రోజు తెలంగాణ చరిత్రలొనే కాదు స్వాతంత్ర భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అన్నారు.

65 లక్షల farmers కుటుంబాలు, 60 లక్షల టీ ఆర్ ఎస్ కార్యకర్తల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదు ఒక సాహసం అని కొనియాడారు. covid 19 నిబంధనలను పాటిస్తూ అన్ని వర్గాలు కేసీఆర్ పట్ల కృతజ్ఞతలు ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు.

ఈ సంబరాలను సంక్రాంతి దాకా పొడగిస్తున్నామన్నారు. KCR మహా సంకల్పానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నామన్నారు కేటీఆర్. History of Agriculture లో ఇదొక సువర్ణ అధ్యాయం అని.. టీ ఆర్ ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని..
..రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు Political tourist లు రాష్ట్రానికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలే అన్నారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ వరస క్రమంలో మొదటి స్థానమే కాదు.. రైతుల ఆత్మహత్యల్లో కూడా మొదటి స్థానంలో నిలిచిందని... దిగుబడుల్లో చివరి స్థానంలో ఉందని అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి ఎంత మారిందో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఊర్లకు ఊర్లె వల్లకాడు గా మారాయని కేటీఆర్ అన్నారు. ఉద్యమం లో రైతుల దుస్థితి చూసి కేసీఆర్ చలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. అపుడు కరెంటు లేదు.. పెట్టుబడి సాయం లేదు. పంట దిగుబడులు లేవు.. అని చెప్పుకొచ్చారు. 

మీడియాలో అపుడు రైతుల దుస్థితి గురించి వచ్చిన కథనాలు చూస్తే ఇపుడు పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుందన్నారు. వలసల దుస్థితి అంతరించిందని, రైతుల దర్జా పెరిగిందని అన్నారు. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ట్రైనీ ఐఎస్ లకు పాఠ్యంశాలు గా మారాయని చెప్పారు. 

కోటి ఎకరాల మాగాణే కాదు. ముక్కోటి టన్నుల ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు. fci గోడౌన్ల లో పట్టనంత ధాన్యం తెలంగాణ నుంచి వస్తోంది నిజం కాదా? అని ప్రశ్నించారు.  వ్యవసాయానికి కేసీఆర్ ఇచ్చిన ఊతమే రైతు జీవితాలను మార్చింది నిజం కాదా? రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్ల లో పడటం లేదా? కావాలంటే నా దగ్గర రికార్డులు ఉన్నాయన్నారు.

వేరే రాష్ట్రాలు కూడా రైతు బంధు ను అనుసరిస్తున్నాయని, 50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరిందన్నారు. ఆసరా పెన్షన్ల ను విమర్శించే రాజకీయ నాయకుల తల్లి దండ్రులు దాన్ని తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశాము. మిగతాది దశల వారీ గా చేస్తాంఅన్నారు. 

కాంగ్రెస్ రెండు లక్షల రుణాల మాఫీ చేస్తామన్నా ప్రజలు నమ్మలేదని.. అందుకే తమకే రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. రైతు బీమా రైతు కు రక్షణ కవచంగా మారిందన్నా మంత్రి కేటీఆర్. రైతు బీమాతో కేసీఆర్ రైతులకు అన్నగా మారారన్నారు. రైతు బీమా కు 3205 కోట్ల మేర ప్రీమియం కట్టామన్నారు. 

70 వేల మంది రైతులకు రైతు బీమాతో ప్రయోజనం జరిగింది. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని మరో ప్రశ్న వేశారు. కేంద్రం నుంచి అరపైసా సాయం లేకున్నా కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం అన్నారు. 70 యేండ్ల లో ఇంత త్వరితగతిన ప్రాజెక్టు కట్టిన సందర్భం ఉందా? చెప్పాలన్నారు. 

జాతీయ పార్టీ లకు మమ్మల్ని విమర్శించే మొహం ఉందా? ఎక్కడైనా ఇంత వేగం గా ప్రాజెక్టు కట్టారా? అని విమర్శించారు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లు కేసీఆర్ కు రెండు కండ్లు అని చెప్పుకొచ్చారు. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయితే కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు ఊపిరి అన్నారు. 

పాలమూరు కొందరు దుర్మార్గుల కోర్టు కేసులతో కొంత ఆలస్యం అవుతోందని.. అయినా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు బీడు భూములకు ఖిల్లాగా ఉండేది. ఇపుడు చేపల చెరువులకు అడ్డాగా మారిందన్నారు. కేసీఆర్ వ్యవసాయానికి దిక్సూచి గా మారారు. నదులకు నడక నేర్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.

మా ప్రభుత్వ విధానాలు ఇతర పార్టీలకు ఎన్నికల నినాదాలు గా మారాయి. ప్రాథమిక రంగాల్లో తెలంగాణ వృద్ధి రేటు 8 శాతానికి పెరిగింది..  తెలంగాణ వచ్చినపుడు అది1.8 శాతమేనని.. తెలంగాణ gsdp పెరగడానికి రైతన్న ల భాగస్వామ్యం ఎంతో ఉందని..
..రైతు బంధు సమితులు రైతు వేదికలు ఏర్పాటు చేసి అన్నదాతాల్లో విశ్వాసం నింపామన్నారు.

లక్ష రైతు కల్లాలు ఏర్పాటు చేశామన్నారు. మండు వేసవి లోనూ తెలంగాణలో చెరువులు  మత్తడ్లు  దుంకుతున్నాయని,..తెలంగాణలో హార్వెస్టర్ల, ట్రాక్టర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పారు. ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందని.. అవి 
సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి),శ్వేత విప్లవం, నీలి విప్లవం అని.. వీటిని గట్టిగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

వ్యవసాయం అనుబంధ విభాగాలకు 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అని.. నేను తెలంగాణ భవన్ వేదిగ్గా సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే రైతులకు వేరే రాష్ట్రాల్లో ఇంత మేలు ఏదైనా చేశారో చెప్పండి. చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు.
మేము శ్వేత పత్రాలు ఇస్తున్నాం నల్ల చట్టాలు కాదు. రాజకీయ పర్యాటకులు వస్తే అభ్యంతరం లేదు. తెలంగాణ పర్యాటక రంగానికి అది మేలు చేస్తుండొచ్చు. కానీ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు. గణాంకాలు ఉంటే చెప్పండి అని.. nda అంటే నో డేటా ఆవేలేబుల్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. మా కంటే ఎక్కువ రుణ మాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పండని.. విమర్శించే వాళ్లకు నెత్తి లేదు కత్తి లేదు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios